హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ. లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని ఏదో జనరల్‌గా చెప్పామని, ఎంతవుతుందో తమకు తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తన ఇల్లు కూడా మూసీ ప్రాజెక్టులో కూలిపోతుందని తెలిపారు. షాద్‌నగర్ ఎమ్మె ల్యే శంకర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీరెడ్డి పాల్గొన్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలుతొలుత 12 కేంద్రాల ఏర్పాటు
హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): బహిరంగ మార్కెట్లో మక్కల ధర పడిపోవడంతో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఎండీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. నాఫెడ్ తరఫున జగిత్యాల, నిర్మల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలను శనివారం నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం మక్కలకు మద్దతు ధర రూ. 2225 ఉండగా మార్కెట్లో 2వేల ధర పలుకుతున్నది.