నాగర్కర్నూల్ : వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ కూడా అధైర్యపడొద్దని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli )అన్నారు. మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో(Heavy rains) నాగర్కర్నూల్ జిల్లాఅతలాకుతలమై, ఆస్తి, పంట నష్టం జరిగిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరధిలోని చౌటబెట్ల, నర్సింగరావుపల్లి, తాళ్ల నర్సింగాపూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
ముంపుబారిన పడ్డ పంట పొలాలు, కోతకు గురైన రోడ్లు, తెగిపోయిన బ్రిడ్జిలను క్షేత్రస్తాయిలో పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా అని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంతటి విపత్తుపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ విపత్తుగా (National calamity) ప్రకటించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి సాయాన్ని ప్రకటించాలని కోరారు.