Minister Jagadish Reddy : సూర్యపేటలోని వారసత్వ ప్రదేశాల(Historical Sites)కు పూర్వ వైభవం తీసుకురావడానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadish Reddy) శ్రీకారం చుట్టారు. ఆత్మకూరులోని 1300 ఏళ్ల మెట్ల బావి(Step Well)తో పాటు చెన్నకేశవ ఆలయా(Chennakeshava Temple) జగదీశ్ రెడ్డి ఈరోజు సందర్శించారు. మెట్లబావి పూడికతీత పనులను పురావస్తు శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
చెన్నకేశవ స్వామి విగ్రహం క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటిదని, మహామండపంలో ఇరువైపులా ఉన్న అల్వార్ విగ్రహాలు 18వ శతాబ్దం నాటివని, ఆలయంలో రాతి స్తంభాలతో ఉన్న ముఖ మండపం కూడా 18 శతాబ్దం నాటిదని పురావస్తు అధికారులు మంత్రికి చెప్పారు. అంతేకాదు 18 వ శతాబ్దం నిర్మించిన మెట్ల భావికి 13 శతాబ్దం నాటి కాకతీయ స్థంబాలు ఉన్నాయని వివరించారు. దాంతో, మెట్ల బావికి పూర్వ వైభవం తేవడానికి మంత్రి జగదీశ్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
గణపతి విగ్రహానికి పూజలు చేసిన జగదీష్ రెడ్డి
పురావస్తు పరిశోధనలో బయటపడిన 120 ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహాన్ని కూడా మంత్రి పరిశీలించారు. మెట్ల బావికి పక్కనే ఉన్న సత్రపు మండపం కూడా అక్కడక్కడ కుంగుబాటుకు గురైనట్లు గ్రహించారు. సత్రపు మండపం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక అంకనం సిమెంటుతో నిర్మితమైనందున మిగతా అంకనాల మాదిరిగా రాతితో పునరుద్ధరించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.
మంత్రి వెంట పురావస్తు పరిశోధకుడు, ప్లీస్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి తో పాటు పురావస్తు శాఖ అధికారి వెంకట్రామిరెడ్డి ఇతర అధికారులతో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ స్వర్ణలత చంద్రారెడ్డి, కొనటం సత్యనారాయణ రెడ్డి, నరసింహారావు, బత్తుల ప్రసాద్, బ్రహ్మం గౌడ్, మల్లారెడ్డి, నంద్యాల వీరారెడ్డి తదితరులు ఉన్నారు.