Minister Jagadish reddy | పురపాలికల స్వచ్ఛతలో సఫాయిల పాత్ర కీలకం : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish reddy | సఫాయి కార్మికులు అందిస్తున్న సేవల వల్ల సూర్యాపేట పట్టణానికి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
సూర్యాపేట : సఫాయి కార్మికులు అందిస్తున్న సేవల వల్ల సూర్యాపేట పట్టణానికి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలో శుక్రవారం రాష్ట్రవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా పట్టణ ప్రగతి(Pattana Pragathi) సంబురాలను నూతనంగా ప్రారంభించిన మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో సఫాయి కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. వారి సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డు(Awards)లను అందుకుందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంటున్న అధికారులను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను అభినందించారు.

పట్టణాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధిని ప్రత్యక్షంగా, పరోక్షంగా, కోర్టుల ద్వారా అడ్డుకున్న శక్తులే ప్రభుత్వంపై అపనిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. తొమ్మిది ఏళ్ళల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
కాలేశ్వరం నుంచి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు 380 కిలో మీటర్ల దూరం నుంచి పారుతున్న సాగు నీరుతో జిల్లా ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా ప్రతిపక్షాలకు బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట్ కిశోర్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

