బీఆర్ఎస్ వైపు యువత చూపు: మంత్రి జగదీశ్ రెడ్డి
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
సూర్యాపేట: బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తుండటంతో యువత కేంద్రం తీరుపై విసుగు చెందుతున్నారన్నారని వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన మోదీ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వేతో పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలను అమ్మేందుకు సిద్ధంగా ఉందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మతంపేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చుపెడుతున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌ల వల్ల భారతదేశం తిరోగమనంలో పయణిస్తుందన్నారు. దేశానికి ప్రధాన ఆధారమైన వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుండగా, సంపన్నులు భారీగా సంపదను పోగేసుకుంటున్నారని విమర్శించారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అనేక సామాజిక జాఢ్యాలతో దేశం నేడు సంక్షుభితంగా మారిపోయిందని చెప్పారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ కూడా మౌలిక పరమైన సమస్యలను పరిష్కరించడం లేదని, కనీసం ఆ దిశగా చొరవ చూపడం లేదన్నారు.
ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు ఆ రెండు పార్టీలకే అధికారం కట్టబెడుతూ వస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి నూతన పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ రూపంలో సమర్థ నాయకత్వం లభించాయన్నారు. ప్రజల కలలను సాకారం చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. దేశంలో రైతుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలనతో యువత, మేధావులు, సామాన్య ప్రజానీకం విసుగెత్తిపోయారని, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అన్నిరాష్ట్రాల వారు కేసీఆర్ పార్టీ గురించి చర్చించుకుంటున్నారని, రాబోయే కాలంలో దేశం గొప్ప మలుపు తిరగబోతున్నదని మంత్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP government
- BRS
- bsnl
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

