Minister Indrakaran reddy | వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు.
వేములవాడ: రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నూతన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమానికి సంబంధించి తొలి సంతకం చేశానని చెప్పారు. తర్వాత మొదటగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు. నేడు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) సాగునీటి రంగానికి ప్రాధాన్యమివ్వడంతో మండుటెండల్లో కూడా చెరువులు కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగడమే దీనికి నిదర్శనమని తెలిపారు.

పేదల దేవుడు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. దాదాపు ఇప్పటికే రూ. 100 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పాలకమండలి నియమించామని తెలిపారు. మరో ఐదారు ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణలో భాగంగా పాలకమండలి వెయ్యలేదు, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

