హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. విశాఖపట్నం జిల్లా సింహచల (Simhachalam) పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి (Varaha Narasimha swamy) చందనోత్సవాన్ని పురస్కరించుకుని సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఇంద్రకరణ్ రెడ్డి దంపతులను ఆశీర్వదించగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy).. మంత్రికి స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు.