ములుగు : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మేడారంలోని పర్యాటక శాఖ గెస్ట్‌హౌస్‌లో ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కేక్ కట్ చేశారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు.