Minister Indrakaran Reddy | నిర్మల్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీ రామనవమి( Sree Ramanavami ) పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. మార్చి 22 ఉగాది( Ugadi ) నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణమహోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 30న సీతారాముల కళ్యాణం, మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనున్నట్లు ఆలయ అధికారులు మంత్రికి వివరించారు.
12 సంవత్సరాలకోసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించాలని, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, ప్రధాన అర్చకులు సీతారామానుజా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.