హైదరాబాద్ : ప్రముఖ నటుడు కృష్ణ మరణంపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన తనను బాధించిందని పేర్కొన్న మంత్రి.. మహేశ్‌బాబుతో పాటు కుటుంబానికి సానుభూతి తెలిపారు. తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్ అని కొనియాడారు. సంచలన సినిమాలు చేయాలన్నా.. సాహస సినిమాలు తీయాలన్నా సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా అన్నారు. నటుడిగా మొదలైన తన సినీ జీవితంలో.. దర్శకుడిగా, మారి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారని గుర్తు చేసుకున్నారు. నిర్మాతగా ఎన్నో మరుపురాని చిత్రాలకు ప్రాణం పోశారని పేర్కొన్నారు. కృష్ణ లాంటి సీనియర్ నటుడ్ని కోల్పోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని నష్టమన్నారు. విభిన్న పాత్రలలో సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.