అవగాహన లేకే టిమ్స్‌పై చౌకబారు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టిమ్స్ నిర్మాణాలపై ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.
- మంత్రి కోమటిరెడ్డిపై ఎక్స్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టిమ్స్ నిర్మాణాలపై ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన టిమ్స్‌పై అవగాహన లేక చవకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందని శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఐదు నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లేని పోని ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. టిమ్స్ పట్ల కనీస అవగాహన లేకుండా కోమటిరెడ్డి మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. టిమ్స్ ఎల్బీనగర్ దవాఖాన నిర్మాణం జీ+14 అంతస్థులు అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం కోమటిరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎకువ అంతస్థులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కార్చుతున్న మంత్రి, రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తలపెట్టిన 24 అంతస్థుల దవాఖాన, ఇండియా కూటమిలో భాగస్వామి సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్థుల హాస్పిటల్ కనిపించడం లేదా? అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

