యాసంగి పంటకు నీళ్లిస్తాం.. రైతులు రందీ పడొద్దు : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది.. యాసంగి పంటకు నీళ్లు రావని మాట్లాడుతున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. 45 రోజుల్లో పంపు హౌజ్‌ల్లో సమస్యలు పరిష్కారమవుతాయని, యాసంగి పంటకు నీరందిస్తాం.. రైతులు రందీ పడాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
నిజానికి గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గోదావరికి అత్యధికంగా 1986లో వరదలు అధికంగా నమోదు అయ్యాయి. 1986లో 107.5 మీటర్ల వరద గోదావరిలో వచ్చింది. గోదావరి నది చరిత్రలోనే ఈ వరద అత్యధికం. మొన్న గోదావరి నదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ఈసారి 108.2 మీటర్ల వరద నమోదైంది. 1986లో వచ్చిన వరద కంటే కూడా 1.2 మీటర్లు ఎక్కువ. ఈ అసాధారణమైన వరద రావడం వల్ల పంపు హౌజ్ రెగ్యులేటర్ వద్దల ఉండే రబ్బర్ సీల్లు ఊడిపోయి పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు పోయాయి. ఇది దురదృష్టకరం. ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం జరిగిప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి.
2008లో శ్రీశైలంలో వరదలు వచ్చినప్పుడు రోశయ్య సెక్రటేరియట్లో పడుకున్నారు. అదొక అసాధారణమైన పరిస్థితి. అప్పుడు శ్రీశైలంలో అన్ని పంపు హౌజ్‌లు కొట్టుకుపోయాయి. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పుడు గోదావరికి వచ్చింది. దానికి బీజేపీ నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారు. ప్రాజెక్టే పోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల రెండు పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు వచ్చాయి. మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. నీళ్లు రావు అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీవి అన్ని దింపుడు కళ్లెం ఆశలే అని చెప్పారు. బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్లు ఇస్తాం. రైతులు రందీ పడాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

