‘పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్. నువ్వు సుదీర్ఘ ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నా’ అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. దీనికి ‘థ్యాంకూ బావ’ అంటూ కేటీఆర్ రిైప్లె ఇచ్చారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీకు ఈ ఏడాది ఆనందం, విజయంతో కూడిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ‘ప్రియమైన వారి పుట్టినరోజు ఎప్పటికీ ప్రత్యేకమైనదే. అదే మా ప్రియమైన అన్నయ్యది అయితే ఇంకా ప్రత్యేకం. మీలాంటి అన్నయ్యను ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. మీకు ఇవే నా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పాజిటివ్ ఆలోచనలను ఇలాగే వ్యాప్తిచేయండి’ అని ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు.
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ట్విట్టర్లో ప్రతి ఒక్కరికి రిైప్లె ఇచ్చేందుకు సాధ్యం కానప్పటికీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు వయసు పెరిగిందున అప్పుడప్పుడు తెల్ల గడ్డంతో కనిపిస్తాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.