సిద్ధిపేట: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరీష్రావు ( Harish Rao ) పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు అడబిడ్డలు అందరూ కలిసి ఆడుకునే గొప్ప పండగ బతుకమ్మ అని మంత్రి చెప్పారు.
దేశంలో పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మేనని, ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందని మంత్రి హరీష్రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. అంతేగాక ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.