హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష కాంటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీవీవీ ఆసుపత్రుల పని తీరుపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇన్స్టిట్యూషన్ డెలివరీలు పెరిగాయని, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 97 శాతం నుంచి 99.9 శాతం పెరిగిందన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్ సర్జరీలు, ఆరోగ్య శ్రీ చికిత్సలు, డిపార్ట్మెంట్ల సమన్వయం పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం.. ఐఎంఆర్ 23 నుంచి 21కి తగ్గిందని, 2014లో ఇది 39 ఉండేదని, ఇంకా తగ్గాలన్నారు.
దేశంలో 9వ స్థానంలో ఉన్నామని, కొన్ని రాష్ట్రాలు సింగిల్ డిజిట్లో ఉన్నాయన్నారు. ఆ రాష్ట్రాలతో పోటీ పడి పని చేయాలని సూచించారు. సీ సెక్షన్ ఆపరేషన్లు 61శాతం నుంయి 58 శాతానికి తగ్గించగలిగామని, ఇంకా 20 శాతం తగ్గించాలన్నారు. కర్ణాటకలో 31 శాతం, కేరళలో 38శాతం, మహరాష్ట్రలో 25 శాతం ఉందని, వారితో పోటీపడేలా పని చేయాలని చెప్పారు. ఎంసీహెచ్ ఆసుపత్రులు కొత్తగా ప్రారంభించిన చోట్ల సేవలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, క్రమ పద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా పని చేయాలన్నారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, అంతా బాగానే పని చేస్తున్నారన్నారు.
కొందరి నిర్లక్ష్యం కారణంగా శాఖకే చెడ్డపేరు వస్తుందన్నారు. ఒకటి రెండు చోట్ల జరిగే చెడు సంఘటనలతో అందరికీ చెడ్డపేరు వస్తుందని, ఒక్కరి నిర్లక్ష్యంతో అందరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా అవుతుందని, ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా వైద్యసేవలందించాలన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సలను తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పెరగాలని, ఓపీ బాగా పెంచాలన్నారు. ఆరోగ్య శ్రీ చికిత్సలో ప్రభుత్వ రంగంలో తక్కువ జరుగుతున్నాయంటే మనం రోగుల్లో మన సేవల పట్ల ఆత్మ విశ్వాసం కలిగించలేకపోతున్నట్లే.. పెంషంట్లలో ఆత్మవిశ్వాసం పెంచేలా వైద్యసేవలుండాలన్నారు. రోగులతో ప్రేమగా వ్యవహరించాలన్నారు.
డైనమిక్‌గా పని చేస్తే.. ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందన్నారు. ఆశాలు రాత్రిపూట ఉండేలా ఆసుప్రతుల్లో రెస్ట్ రూం.. ఇతర అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, సూపరింటెండెంట్లందరు బాధ్యత తీసుకోవాలని, ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు లక్షల కాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, కానీ 25వేలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు. టీవీవీ ఆసుపత్రుల్లో లక్ష ఆపరేషన్లు జరిగేలా లక్ష్యం పెట్టుకొని పని చేయాలని, వారం వారం ప్రతి పీహెచ్సీలో కంటి పరీక్షలు నిర్వహించి జరగాలన్నారు. లాంగ్ బోన్ సర్జరీలు పెరగాలని, ఎన్సీడీ స్క్రీనింగ్ వేగంగా చేయాలని, డయాలిసిస్ పేంట్లకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలన్నారు.
ఆసుపత్రి సూపరిండెంట్లు, డీసీహెచ్‌లు టీ డయాగ్నస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకుల బాధ్యత తీసుకోవాలని, సేవలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో బ్లడ్ సపరేటర్లు వాడాలని, పేషంట్లకు అవసరమైన బ్లడ్‌ను ఇవ్వడానికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తం ఇచ్చేందుకు ఇవి వినియోగిస్తామని, ఒకరు ఇచ్చిన రక్తం నలుగురికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో 25శాతం బ్లడ్ తక్కువ ఉందని, బ్లడ్ కోసం ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఏముందని, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ షార్టేజ్ అవుతుందన్నారు.
ముఖ్యుల పుట్టినరోజులు, రాష్ట్ర అవతరణ దినోత్సవం, ప్రజాప్రతినిధుల పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డోనేషన్ బ్యాంకులు ఏర్పాటు చేసి రక్తం సేకరించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని, టీవీవీ ఆసుపత్రుల్లో పని చేసే శానిటేషన్ వర్కర్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చక్కగా పని చేయించాలన్నారు. ప్రతీ బెడ్‌కు రూ.5వేల నుంచి రూ.7500 పెంచామని, శానిటేషన్ విషయంలో మార్పు రావాల్సిందేనన్నారు. ఆసుపత్రుల్లో చెత్తా చెదారం కనిపించకూడదని, అదేరీతిలో డైట్ చార్జీలు పెంచామని, కాబట్టి రోగులకు మంచి ఆహారం అందేలా చూడాలన్నారు.
హెచ్‌ఎంఐఎస్‌లో సమాచారం అప్లోడ్ చేసే విషయంలో అలసత్వం వహించొద్దని, హెచ్‌డీఎస్ నిధులు చేయడం జరిగిందన్నారు. ఆయా ఆసుపత్రుల పనుల కోసం ఆ నిధులు వినియోగించాలని, సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతామహంతి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీవీవీ కమిషనర్ అజయ్ కూమార్, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, టీవీవీ ఆసుపత్రుల సూపరిండెంట్లు, స్పెషలిటీ డాక్టర్లు, డీసీహెచ్‌లు పాల్గొన్నారు.