హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు.. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. అప్పుడే కరోనాను శాశ్వతంగా కట్టడి చేయం సాధ్యమవుతుందని ట్వీట్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు తొలగించి, వ్యాక్సిన్ వేయించిన ఆసిఫాబాద్ జిల్లా దహెగాం ఎస్ఐ రఘుపతిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.
కరోనా వాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలి.అప్పుడే కరోనాను శాశ్వతంగా కట్టడి చేయడం సాధ్యమవుతుంది. కరోనా వాక్సిన్ పట్ల ప్రజల్లో అపోహలు తొలగించి, వాక్సిన్ వేయించిన అసిఫాబాద్ జిల్లా దహెగాం ఎస్సై రఘుపతి గారికి అభినందనలు.#TSFightsCorona pic.twitter.com/t373FmdTFz
— Harish Rao Thanneeru (@trsharish) December 24, 2021