సీపీఆర్ ద్వారా 10 మందిలో ఐదుగురిని బతికించుకోవచ్చు : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | హైదరాబాద్ : కార్డియాక్ అరెస్టు( Cardiac Arrest ) ఎవరికైనా రావొచ్చు.. అది రావడానికి సమయం, సందర్భం లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు.
Minister Harish Rao | హైదరాబాద్ : కార్డియాక్ అరెస్టు( Cardiac Arrest ) ఎవరికైనా రావొచ్చు.. అది రావడానికి సమయం, సందర్భం లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు. మన దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారు. ప్రతి రోజు సగటున 4 వేల మంది చనిపోతున్నారు. ఈ చనిపోతున్న వారి సంఖ్యను సీపీఆర్( CPR ) ప్రక్రియ ద్వారా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. కానీ సీపీఆర్ ప్రక్రియను విజయవంతం చేయగలిగితే 10 మందిలో ఐదుగురిని బతికించుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వోతో పాటు పలు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో సీపీఆర్( CPR )శిక్షణను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆ కొద్ది నిమిషాల్లో సీపీఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను బతికించుకోవచ్చు. తెలంగాణలో సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల ఏడాదికి 24 వేల మంది చనిపోతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సీపీఆర్ శిక్షణ బాగా చేయగలిగితే ఇందులో సగం మందిని కాపాడుకోవచ్చు. సీపీఆర్ చేసేందుకు అవగాహన, శిక్షణ మాత్రమే అవసరం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సీపీఆర్ శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉండే సెక్యూరిటీతో పాటు ఇతరులకు కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడటమే సీపీఆర్ లక్ష్యం. ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ మారిపోయింది. చెడు అలవాట్లకు అలవాటుపడ్డారు. ఆహారపు అలవాట్లు మారాయి. పని ఒత్తిడి కారణంగా షాక్స్ వస్తున్నాయి. కరోనా తర్వాత కూడా కార్డియాక్ అరెస్టులు పెరిగాయి. ప్రజలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్య రక్షణ కోసం లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలి. సీపీఆర్ ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పిస్తాం. సీపీఆర్‌ను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వరకు తీసుకెళ్లేందుకు వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

