మెదక్ : సీఎం కేసీఆర్(CM KCR) ఈనెల 16న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao )స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి సభ ఏర్పాట్లు పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రతిపక్షాలకు కండ్లు తిరిగేలా నర్సాపూర్ గులాబీ మయం కావాలన్నారు. అందరూ కలిసి సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.