హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆడపిల్లలను ఓ ఎత్తుకు ఎదగనివ్వండి అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
ఆమెకు శక్తినివ్వాలి.. ఆమెను ఆకాశమంత ఎత్తుకు ఎదగనివ్వాలని కోరుతూ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
2008, జనవరి 24ను జాతీయ బాలికల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ప్రతి ఏడాది జనవరి 24ను జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంచడం, పీడన నుంచి విముక్తి కల్పించడం జాతీయ బాలికల దినోత్సవ ముఖ్య ఉద్దేశం. విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటం.
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, పోషకాహారం, సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏటా జనవరి 24ను ‘జాతీయ బాలిక దినోత్సవం’గా నిర్వహిస్తోంది.
Let them fly high#NationalGirlChildDay pic.twitter.com/oikbRwaeC1
— Harish Rao Thanneeru (@trsharish) January 24, 2022
Empower her and see her touch the sky, greetings to all on #NationalGirlChildDay pic.twitter.com/xZsJsrCHYW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2022