సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:05:28

ఆంధ్రాపెత్తనం కొనసాగాలా?

ఆంధ్రాపెత్తనం కొనసాగాలా?

  • టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్ల తర్వాత కూడా హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వానికి పెత్తనం ఉండాలని భావిస్తున్నారా?’ అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వందేండ్ల లైఫ్‌ ఉన్న సచివాలయ భవనాలను కూల్చివేయడం దారుణమని ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం స్వచ్ఛందంగా, అధికారికంగా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌తోపాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిందని గుర్తుచేశారు. దీంతో సెక్షన్‌-8 అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ‘ఏపీ సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతున్నట్టు కనబడుతున్నది’ అంటూ ఫైర్‌ అయ్యారు.


logo