Minister Harish rao | బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించేందుకు లక్ష ఆర్థిక సాయం : మంత్రి హరీశ్ రావు
Minister Harish rao | కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట : కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించాటినికి లక్ష రూపాయల ఆర్థిక సాయం- సిద్దిపేట నియోజకవర్గం స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు, చేనేత మిత్ర వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
మత్స్యకారుల కోసం నీటి వనరులలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామని తెలిపారు.600 కోట్ల రూపాయలు వ్యయం చేసి మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ, గీత కార్మికులకు చెట్లు పన్ను, పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరణ..ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో మోడల్ దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో 2 కోట్ల 20 లక్షల రూపాయలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మట్టి కుండలు, మట్టి వంట పాత్రలు, మట్టి గ్లాసులు తదితర మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నాము.
జిల్లాలో ఇప్పటికీ ఎస్సీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ ఉంది.
జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని మంత్రి వివరించారు. త్వరలోనే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీ వరకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

