
కరీంనగర్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో బుధవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించనున్నారు. ఆయనతోపాటు మం త్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా రానున్నారు. ఇల్లందకుంటలో పది వేల మందితో బహిరంగ సభ నిర్వహించనుండగా, వీణవంకలో మహి ళా సంఘాలకు రూ.20 కోట్ల ఆస్తులు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలతో భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు జమ్మికుంట నుంచి ఇల్లందకుంట మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీతో వెళ్లనున్న మం త్రులు.. స్థానిక రామాలయంలో పూజలు చేస్తారు.