
సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 19: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి పెద్దమనసును చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన పొన్నం శోభ అనే మహిళ బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించగా, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన శోభ, ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉండటంతో ఈ విషయాన్ని ఏఎంసీ డైరెక్టర్ మోతే మహేశ్, టీఆర్ఎస్ నాయకుడు తాటిపాముల శ్రీనివాస్‌గౌడ్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.3 లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం శోభ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.