రంగారెడ్డి : ముచ్చింతల్ క్షేత్రంలో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల అంకురార్పణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామిని కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీస్సులు తీసుకున్నారు. బసవన్నకు దండం పెట్టుకున్నారు.
అనంతరం ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న యాగ శాలలో 108 దివ్య దేశాల ప్రతిష్ట, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమత మూర్తి లోకార్పణ ఏర్పాట్లను పరిశీలించి వాలంటీర్లకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించి వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.