హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని న కనకదుర్గమ్మ వారిని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar Rao) దంపతులు గురువారం దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వాగతం పలికి, అమ్మ వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అన్నవరం (Annavaram) శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మంత్రి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆయల పండింతులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేశారు.