హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దేశంకోసం, భారతదేశ బాగు కోసం ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభకు జిల్లాల నుంచి ప్రారంభం అయ్యారు. ప్రజలతోపాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరిపెడ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పార్టీ కార్యకర్తలతో కలిసి బస్సులో వస్తున్నారు. ఇక మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి లారీలో బయలుదేరారు.