హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆరోగ్య రం గానికి సంబంధించి శాసనమండలిలో సభ్యులు ఎంఎస్ ప్రభాకర్‌రావు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వాణీదేవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించామని గుర్తుచేశారు. ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులో ఉంటాయని, 2,500కు పైగా డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఉన్నాయని తెలిపారు.