పెంట్లవెల్లి, ఆగస్టు 8 : కృష్ణానది తీరంలో శిథిలావస్థకు చేరిన ఏండ్ల తరబడి మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైన్ వంతెనపై పిడుగుపాటుకు నేలమట్టమైంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో 1994లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 లక్షలతో.. 500 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వేంకల్ మినీ లిఫ్ట్‌ను ప్రారంభించింది. నీటిని ఎత్తిపోసేందుకు కృష్ణానదిపై కొద్దిదూరం వంతెన నిర్మించి దానిపై పైపులైన్లు ఏర్పాటు చేయగా.. పనులు అసంపూర్తిగా వదిలేశారు. నాటి నుంచి వృథాగా ఉన్న ఎత్తిపోతలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో శిథిలావస్థకు చేరగా శుక్రవారం పిడుగు పడటంతో కుప్పకూలింది.