యాదాద్రి భువనగిరి : హైదరాబాద్లో మిలియన్ మార్చి కాదు, దమ్ముంటే ఢిల్లీలో బండి సంజయ్ బిలియన్ మార్చి చేయాలని వైద్య, శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఉద్యోగాల నియామకంపై హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ కాదు ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
దేశంలో ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు నింపారో.. నిరుద్యోగులకు ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారో కేంద్ర ప్రభ్యత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..వాటిని ఎప్పుడు నింపుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకంలో ఎందుకు కోత పెట్టారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని అన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదలపై స్పష్టతను ఇవ్వాలని అన్నారు.
కేంద్రం రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుందని మంత్రి తెలిపారు. ఫేక్ సోషల్ మీడియాకు యువత సరైనా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అబద్ధాల పునాది పై బీజేపీ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.