నారాయణపేట, జూన్ 24: నెలల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని భోజన కార్మికులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి బాల్రాం హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల్లో భాగంగా మధ్యాహ్న భోజన కా ర్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం అం దించాలని కోరారు. వినతి పత్రాన్ని డీటీ నారాయణ, డీఈవో కార్యాలయ అధికారి యాదయ్య శెట్టికి అందజేశారు.