శంషాబాద్ విమాన ప్రయాణికులకు రాయదుర్గంలో లగేజ్ చెక్ఇన్
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
- విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్
- ఎలివేటెడ్ ట్రాక్‌తోపాటు అండర్‌గ్రౌండ్, గ్రేడ్ లెవెల్ ట్రాక్‌ల ఏర్పాటు
- హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు రాయదుర్గం మెట్రో స్టేషన్లోనే లగేజ్ చెక్ ఇన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, మళ్లీ ఎయిర్‌పోర్టులో ఎలాంటి తనిఖీలు ఉండబోవని వెల్లడించారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్ సేవలు ప్రారంభమై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయానికి తొలుత 10 మెట్రో రైళ్లను ప్రారంభిస్తామని, వీటిని ప్రతి 8 నిమిషాలకు ఒకటి చొప్పున నడుపుతామని వివరించారు. ఈ రైళ్లలో విమానాశ్రయానికి వెళ్లేవారు నేరుగా తమతమ గేట్ల వద్దకు చేరుకోవచ్చని, లగేజీని తీసుకెళ్లేందుకు ఈ రైలు బోగీల్లో కావల్సినంత స్థలం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశలో మాదిరిగా కాకుండా రెండో దశలో ఎలివేటెడ్ ట్రాక్‌తోపాటు గ్రేడ్ లెవల్, అండర్‌గ్రౌండ్ ట్రాక్‌లు కూడా ఉంటాయన్నారు. మొత్తం 31 కి.మీ. పొడవైన ఈ కారిడార్‌లో 26.365 కి.మీ. ఎలివేటెడ్ ట్రాక్, 2.630 నుంచి 2.635 కి.మీ. అండర్‌గ్రౌండ్ ట్రాక్, 0.840 కి.మీ. గ్రేడ్ లెవల్ ట్రాక్ ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్, హెచ్ఎంఆర్ఎల్, కియోలిస్, ఫోన్‌పే అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను తరచుగా వినియోగించుకొంటున్నవారిలో 15 మంది విశిష్ట కస్టమర్లను సత్కరించి ఒక్కొక్కరికి రూ.10 వేల విలువైన వోచర్‌ను బహూకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

