Electricity Bill | కమాన్‌పూర్, ఫిబ్రవరి 23 : వ్యవసాయ మోటర్ బిల్లు పెండింగ్‌లో ఉన్న వారి ఇంటి మీటర్ కనెక్షన్లను కట్ చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు పెద్దపల్లి జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు. వ్యవసాయ మోటర్ల బకాయి చెల్లించకపొతే ఇంటి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామంటూ ముందస్తుగా హె చ్చరిస్తున్నారు. దీంతో అప్పు చేసి కరె ంట్ బకాయిలు కడుతుంటే.. మరికొందరు చేతిలో డబ్బులు లేక కరెం ట్ క్షనెక్షన్లు పోగొట్టుకుంటున్నారు.
కమాన్‌పూర్ మండలంలోని 9 గ్రామాల పరిధిలో 2888 వ్యవసా య విద్యుత్ కనెక్షన్లు ఉండగా, బకాయిలు రూ.23,79,715 ఉన్నా యి. 2051 మంది బకాయిల్లో కొంత చెల్లించగా, 837 మంది చెల్లించాల్సి ఉంది. దీంతో అధికారులు రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా కట్టించాలని ఇంటి మీటర్ కనెక్షన్లు కట్ చేస్తామంటూ హెచ్చరిస్తూనే.. తొలగింపు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : మహాశివరాత్రి సందర్భంగా వివిధ శివాలయాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మూడు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిం ది. ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతోపాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు వెళ్లే భక్తు ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలపై 50% అదనపు చార్జీలు వసూలు చేయనుంది. రెగ్యులర్ సర్వీస్ టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. టికెట్ల బుకింగ్‌కు www.tgsrtcbu s.inను సంప్రదించాలని అధికారు లు పేర్కొన్నారు. స్పెషల్ బస్సుల సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కా ల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ను సంప్రదించాలని సూచించారు.