వరంగల్, నవంబర్ 19: ఎన్ని పనులున్నా సరే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు రావాలని మహిళా సంఘాల సభ్యులకు మెప్మా అధికారులు హుకుం జారీ చేశారు. లేదంటే లోన్లు రావని, సంక్షేమ పథకాలు కట్ చేస్తామని సీవో, ఆర్పీలు మహిళలను బెదిరించారు. దీంతో భయపడిన మహిళలు మంగళవారం హనుమకొండలో నిర్వహించిన సభకు తరలివెళ్లారు.
బహిరంగ సభకు వచ్చే మహిళా సంఘాల సభ్యులకు మెప్మా అధికారులు బస్సుల్లోనే భోజనాలు సమకూర్చారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్‌కు రెండు బస్సు లు ఏర్పాటు చేసి సీవో, ఆర్పీలతో మహిళలను సభకు తరలించారు. మధ్యాహ్నం ఆర్పీల ద్వారా భోజన ప్యాకెట్లు అందజేశారు. మహిళలు మధ్యలో వెళ్లి పోకుండా ప్రతి బస్సుకు ఆర్పీలను ఏర్పాటుచేశారు.