హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ): మహిళా ఉద్యమాల్లోకి పురుషులనూ భాగస్వాములను చేయాలని ఐద్వా ఆలిండియా కమిటీ కోశాధికారి పుణ్యవతి, ప్రముఖ జర్నలిస్ట్ సీ వనజ పిలుపునిచ్చారు. మహిళలు, పురుషులు శతృవులనే భావనలను సమాజంలోకి జొప్పిస్తున్నారని, ఇలాంటి భావనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో శుక్రవారం ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కే నాగలక్ష్మి అధ్యక్షతన మహిళల భద్రత – ప్రభుత్వాల వైఖరి’ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు.