హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(అస్కి), రిస్క్ అండ్ కంప్లయన్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఆర్సీపీఏ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మూడేండ్లు అమల్లో ఉంటుం ది. శుక్రవారం నగరంలోని అస్కికి చెందిన బెల్లా విస్టా క్యాంపస్‌లో అస్కి డైరెక్టర్ జనరల్ నిర్మల్యబా గ్చి, ఆర్సీపీఏ డైరెక్టర్ జీ గోపాలకృష్ణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకా రం… బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ల నిర్వహణ)కు సం బంధించి వివిధ అంశాలపై ఉమ్మడి ధ్రువీకరణలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ రంగాల్లో సంయుక్తంగా పరిశోధనలు చేస్తా రు. కార్యక్రమంలో అస్కి రిజిస్ట్రార్ కల్యాణ్రాయ్, ఇరు సంస్థల సిబ్బంది మధుసూదన్ రావు, సాయి కిరణ్, రాం శిరీశ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.