బడంగ్‌పేట, మార్చి 30: సివిల్ వ్యవహారాల్లో తలదూర్చడంతోపాటు లంచావతారమెత్తిన మీర్‌పేట ఎస్ఐ బొడ్డుపల్లి సైదులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో 200 గజాల ప్లాట్‌కు సంబంధించిన వివాదాన్ని సెటిల్ చేసేందుకు సుభాష్ అనే వ్యక్తి నుంచి రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేసిన సైదులును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి రూ.10 వేలు రికవరీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.