హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ) : మెడికల్ పీజీ అడ్మిషన్లలో భాగంగా తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు కాళోజీ హెల్త్ వర్సిటీ పేర్కొన్నది. ఈమేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫైనల్ మెరిట్ లిస్టులో పేరు ఉన్న విద్యార్థులు బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఈ నెల 13న ఉదయం 6 గంటల వరకు https://tspgmed.tsche.in/ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని కోరింది.