హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : అర్హత లేకుండా నడుపుతున్న నకిలీ క్లినిక్‌లపై మెడికల్ కౌన్సిల్ దాడులు చేసింది. మంగళవారం వరంగల్‌లోని కాశీబుగ్గలో రెండు క్లినిక్‌లపై మెడికల్ కౌన్సిల్ సభ్యుడు నరేశ్‌కుమార్, యాంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు రాకేశ్ తనిఖీలు చేశారు. త్రివేణి, హిజమా కప్పింగ్ థెరపీ క్లినిక్‌లలో నిల్వ ఉం చిన యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, మలేరియా ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
క్లినిక్‌లు నడుపుతున్న మామిడి ఈశ్వరయ్య, ఎస్కే నయీమ్‌పై ఎన్ఎంసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు అర్హత కలిగిన వైద్యుల వద్దనే చికిత్స పొందాలని ఈ సందర్భంగా వారు సూచించారు. నకిలీ వైద్యుల సమాచారాన్ని 91543 82727 నంబరుకు వాట్సాప్ ద్వారా గానీ, antiquackerytsmc@onlinetsmc.in మెయిల్ ద్వారా గానీ తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.