హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పనులను వేగంగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెడికల్ కాలేజీలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్సీ సీటివ్వండి: సీపీఐ
హైదరాబాద్, మార్చి 5 (నమస్తేతెలంగాణ): ఒప్పందం ప్రకారం సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ బృందం కోరింది. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని బృందం కలిసింది.