కొడంగల్, మే 30: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని అప్పాయిపల్లిలో ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్యకళాశాల ప్రహారీ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. శ్మశానవాటికకు ఐదెకరాల స్థలం కేటాయించిన తర్వాతనే పనులు చేపట్టాలని స్పష్టంచేశారు. మెడికల్ కాలేజీకి చెందిన 60 ఎకరాలకు భూమికి ఆనుకొని శ్మశానవాటిక ఉందని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం భూసేకరణ చేసినప్పుడే శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. చెప్పిన ప్రకారం భూమి కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులతో చర్చించారు. రెండు రోజుల తర్వాత అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కరించేలా చూస్తామని హమీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.
48 దవాఖానాలకు సర్కారు నోటీసులు
సరైన డైట్ పాటించకపోవడంపై చర్యలు హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 48 దవాఖానాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఆయా దవాఖానల సూపరింటెండెంట్లకు ఈ మేరకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఆయా దవాఖానలలోని ఇన్ పేషెంట్లకు సరైన డైట్, మెనూ పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు వైద్య విధాన పరిషత్ విభాగం ఉన్నతాధికారులు ఆ నోటీసులో తెలిపారు.