చేగుంట,అక్టోబర్18: ఖరగ్పూర్ ఐఐటీలో మెదక్ జిల్లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లికి చెందిన అనిత, చందర్ దంపతుల రెండో కుమారుడు కిరణ్ చంద్ర(20) పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం తాను ఉండే హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.