మెదక్, జనవరి 21(నమస్తేతెలంగాణ) : మెదక్-అక్కన్నపేట మధ్య రూ.15.49 కోట్లతో నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ ట్రయల్న్ పనులు విజయవంతమయ్యాయి. మంగళవారం అక్కన్నపేటలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బ్రిజ్ మోహన్ మీనా జెండా ఊపి ట్రయల్న్న్రు ప్రారంభించారు. విద్యుత్ ఇంజిన్తో అక్కన్నపేట-మెదక్ 17.2 కిలోమీటర్ల విద్యుదీకరణ ట్రయల్న్న్రను తనిఖీ చేశారు. అక్కనపేట లైన్ విద్యుద్దీకరణతో హైదరాబాద్ డివిజన్లో 94శాతం విద్యుద్దీకరణ పూర్తయినట్టు తెలిపారు. దీంతో కాలుష్యం తగ్గడంతోపాటు అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. మనోహరాబాద్ నుంచి సిద్దిపేటకు కొత్తగా నిర్మించిన రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు చేపడతామని తెలిపారు. మేడ్చల్ నుంచి మెదక్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని ముథ్కేడ్ వరకు 251 కిలోమీట్లర్లు డబ్లింగ్ పనులు మంజూరైనట్టు వెల్లడించారు.