హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సిద్ధంగా ఉన్నదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం టిమ్స్‌ను సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా టిమ్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.