హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : 2025-26 విద్యాసంవత్సరానికిగాను ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ సీట్లను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం కేటాయించింది. అలాట్ అయిన కాలేజీలో రిపోర్టింగ్ చేసేందుకు ఈ నెల 23న సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది.
హైరదాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లనున్నారు. ఈ మేరకు ఆమెను ఎన్సీఆర్బీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి చందన్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
2009 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన రాజేశ్వరిని డిప్యూటేషన్ పద్ధతిలో ఐదేండ్లపాటు ఈ పదవిలో నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేరొన్నారు. ఆమె అసాధారణమైన సేవలకు ఈ గుర్తింపు పొందారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు నిర్వహించినప్పుడు, తప్పుడు వార్తలకు వ్యతిరేకంగా ఆమె చేపట్టిన ప్రచారం జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. బాల్య వివాహాలు, గృహహింస వంటి సామాజిక సమస్యలపై ఆమె విశేష కృషి చేశారు.