హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో భాగంగా సైనికుల పిల్లలకు (సీఏపీ కోటా) మంగళవారం నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు కాళోజీ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ సైనికులు, సర్వీస్‌లో ఉన్న సైనికుల పిల్లలు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం హైదరాబాద్ సోమాజిగూడలోని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫీస్‌లో సంప్రదించాలని పేర్కొన్నది. మంగళవారం ఉదయం ఒకటి నుంచి 1.25 లక్షల ర్యాంకులోపు వచ్చిన అభ్యర్థులు, మధ్యాహ్నం 1.25 లక్షల నుంచి 2.50 లక్షల ర్యాంకు వరకు, 19న 2.50 లక్షల నుంచి చివరి ర్యాంకు వరకు వచ్చిన అభ్యర్థులు హాజరు కావాలని పేర్కొన్నది.