జనగామ, అక్టోబర్ 25 : బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన వడ్డెర సంఘం, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు బుధవారం పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో రూపాని ఐలయ్య, రూపాని రాజు, ఇంద్రయ్య, జయబాబూ, లింగన్న, ప్రేమ్ సాగర్, సంపత్, నాగరాజు, వెంకన్న, నరేష్, ఉప్పలయ్య, చైతన్య, నరేష్ తదితరులు ఉన్నారు. వీరంతా ఎంపీపీ ఉపాధ్యక్షుడు వీరస్వామి, రైతు కోర్డినేటర్ పొడిశెట్టి వెంకన్న, ఉపసర్పంచ్ వెలికట్ట సోమన్న, ఈరెంటి సాయి, వెలికట్ట మధు తదితరుల అధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
పెద్ద మంగ్యా తండా నుంచి..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పెద్ద మంగ్యా తండాకి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు 70 మంది మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బుధవారం పాలకుర్తిలో బీఆర్ఎస్లో చేరారు. వాళ్లకి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అలాగే తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన సాధు చంద్రయ్య, తమ్మి మల్లికార్జున్, పల్లె సుమన్, మేర కృష్ణ, పొడిశెట్టి సంపత్, బాలగాని రాజు, పల్లపు యాకయ్య, ఓరుగంటి కుమార్ లు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండా, ఎంసీ తండాలకు చెందిన పలువురు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాలకుర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో వాళ్లకి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భాస్కర్, లింగ్యా, రెడ్యా, సునీత, విజయ, కవిత, సునీత, సొమ్లా, నాజి, లక్ష్మి, జ్యోతి, సరిత, హెమ్లా తదితరులు ఉన్నారు.