మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 21: రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్‌లోని రాయల్ మార్కెటింగ్ హగ్గీస్ పరిశ్రమలో పెద్ద ఎత్తున స్టాక్ భద్రపర్చారు.
గురువారం రాత్రి పరిశ్రమను మూసి వేసి నిర్వాహకులు, సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో లోపల మంటలు చెలరేగి, ఈ ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా జరిగినట్టు తెలుస్తున్నది.