ఆత్మకూరు(ఎస్) : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. టీఆర్పీ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సహా పలువురు కార్యకర్తలు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో గులాబీ గూటికి చేరారు. వారికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పాతర్లపాడు సర్పంచ్ అభ్యర్థి అరేంపుల ఉపేంద్ర సైదులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
సైదులు 2001 నుంచి ఉద్యమ నాయకుడిగా కొనసాగుతూ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి సైదులు అని చెప్పారు. గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ఉపేంద్ర సైదులు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహారావు, జడ్పీమాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ కేశ బోయిన మల్ల యాదవ్, మాజీ ఎంపీటీసీ పరకాల ఉపేందర్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కొంగలి మధుసూదన్, మాజీ ఉప సర్పంచ్ కొంగాలి జానయ్య పాల్గొన్నారు.