నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీలోకి(BRS) వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేశోజు రామాచారి, నాయకులు లేళ్ల సందీప్ రెడ్డి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో(Massive additions) చేరారు. వారికి భూపాల్ రెడ్డి గులాబీ కండువ కప్పి పార్టీకిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందన్నారు. వాళ్ల పార్టీ నాయకులే ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
కాంగ్రెస్ నేతల చేరికతో నల్లగొండ నియోజక వర్గం పూర్వ వైభవానికి తొలిమెట్టని అన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కలిసికట్టుగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, లొడంగి గోవర్ధన్, కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, గాదె వివేక్ రెడ్డి, స్థానిక నాయకులు ఎర్రమాత శ్రీనివాస్ రెడ్డి, బుర్రి సందీప్, పగిళ్ల వెంకన్న, కుంట్ల ఆంజనేయులు, ఎర్రమద ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, పిల్లి కోటేష్, బెక్కం సతీష్, పగిళ్ల సతీష్, సుమన్ నాగరాజు, సతీష్. అంజి తదితరులు పాల్గొన్నారు.