Revanth Reddy | ఆసిఫాబాద్, అక్టోబర్ 28: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తనకు టికెట్ కేటాయిస్తానని చెప్పి మోసం చేశారని ఆసిఫాబాద్ టికెట్ ఆశించిన మర్సుకోల సరస్వతి మండిపడ్డారు. కాంగ్రెస్ ఓ దొంగ, బ్లాక్ మెయిలర్, అవినీతి పరుడైన శ్యాంనాయక్ను ఆసిఫాబాద్ అభ్యర్థిగా ప్రకటించిందని ఆగ్రహించారు. శనివారం ఆమె ఆసిఫాబాద్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ డబ్బులకు అమ్మడుపోయి శ్యాంనాయక్కు టికెట్ ఇచ్చిందని ఆరోపించారు.
ఎక్కడి నుం చో వచ్చిన శ్యాంనాయక్కు టికెట్ కేటాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 2002 నుంచి కాంగ్రెస్లో ఉన్నానని తెలిపారు. నియోజవర్గంలో తమ వర్గానికి 15 వేల ఓట్లు ఉన్నాయని, తమ తొమ్మిది తెగలకు చెందినవి 90 వేల ఓట్లు ఉన్నాయని వివరించారు. తన తండ్రి కొట్నాక భీంరావు ఉన్నప్పటి నుంచే ప్రజలతో సంబంధాలున్నాయని చెప్పారు. నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులతో చర్చించి కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు.